About Temple
Online booking procedure : eHundi | Paroksha Seva | eDonation - Click here to book >>
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీకాళహస్తి :: చిత్తూరు జిల్లా
భక్తులకు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ దృష్ట్యా సా tvయంత్రం 6.00 గం// ల నుండి ప్రభత్వము వారు కర్ఫ్యూ విధించి నందున దేవస్తానమునకు వచ్చు భక్తుల సౌకర్యం కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లో covid 19 నిబంధనలకు లోబడి భక్తులను ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 5 :30 ని// వరకు మాత్రమే దర్శనమునకు అనుమతించ బడును మరియు ఆ సమయమునందు రాహు కేతు పూజలకు భక్తులను అనుమతించబడును. మిగిలిన అన్ని ఆర్జిత సేవలన్నియు కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతముగానే నిర్వహించ బడును. ఆర్జిత సేవలలో భక్తులకు అనుమతి లేదు. .
అదేవిధముగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం లో స్వయముగా దేవస్తానమునకు విచ్చేయలేని భక్తుల సౌకర్యం కొరకు online లో పరోక్ష పద్ధతి ద్వారా భక్తులు పూజలు జరిపించుకొనుటకు, ఈ - హుండీ ద్వారా మ్రొక్కుబడులు చెల్లించుటకు మరియు ఈ డొనేషన్స్ ద్వారా విరాళాలు భక్తులు ఇచ్చుటకు ఏర్పాటు చేయడమైనది. ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరు.
పరోక్ష సేవ
ఈ online సేవలు వినియోగించుకోవలసిన భక్తులు https://tms.ap.gov.in ను సందర్శించి అందులోని online services లో కొత్త యూసర్ అయితే సైన్అప్ అయి క్రొత్త అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి, పాత యూసర్ అయితే సైన్ ఇన్ చేసి అందులోని 1. పరోక్ష సేవ 2) ఈ హుండీ 3) ఈ డొనేషన్స్ ల యందు ఏదో ఒకటి ఎంపిక చేసుకొన్న తర్వాత అందులో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఎంపిక చేసుకొని అందులో కనపరిచిన సేవ/ విరాళాల ట్రస్ట్ ను ఎంపిక చేసుకొని అందులోని వివరాలు పూరించిన పిమ్మట మీ యెక్క క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా UPI లేదా HDFC కార్డ్స్ ద్వారా రుసుము చెల్లింపు చేయవచ్చు... చెల్లింపు తర్వాత వచ్చన రసీదును ప్రింట్ తీసుకోవచ్చు.
i) పరోక్ష సేవల వివరాలు:
1.పరోక్ష సేవ రాహు కేతు పూజ రూ. 500/.(రాహుకాలములో)
2.పరోక్ష సేవ శ్రీస్వామి అమ్మవార్ల అభిషేకము .రూ. 1000/-(ఉదయం 7.00 గ// లకు)
3.పరోక్ష సేవ శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం . రూ.501/ (ఉదయం 8.45 గం//లకు)
4.పరోక్ష సేవ శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకం. రూ. 1000/-(ఉదయం 9.30 గం//లకు
5.పరోక్ష సేవ శ్రీ మృత్యుంజయ స్వామి జపం రూ. 216/-(ఉదయం 9.00 గం// లకు
6.పరోక్ష సేవ చండీ హోమం.. రూ. 1116/- (ఉదయం11-00 గం//లకు)
7.పరోక్ష సేవ రుద్ర హోమం . రూ. 1116/-(ఉదయం11-00 గం//లకు)
8.పరోక్ష సేవ మహన్యాస రుద్రాభిషేకo రూ. 1500/-(సాయంత్రం 4.00 గం// లకు)
9.పరోక్ష సేవ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం. రూ. 300/- (ఉదయం 8.00 గం/ లకు గురువారం మాత్రమే)
10.పరోక్ష సేవ శ్రీ శనీశ్వర స్వామి వారి అభిషేకం రూ. 300/- (సాయంత్రం 5.00 గం// లకు శనివారం మాత్రమే)
ఈ పరోక్ష సేవలు వినియోగించుకొను భక్తులకు వారి ఎంపిక చేసుకోబడిన సేవను వీక్షించుటకు వారు రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబరుకు సేవ లింక్ దేవస్థానం వారిచే లింక్ పంపబడును.
ii ) ఈ హుండీ :
ఈ-హుండీ ని ఎంపిక చేసుకొన్న భక్తులు అందులోని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ను ఎంపికచేసుకొని మీ మ్రొక్కుబడులు, కానుకలు చెల్లింపు చేయవచ్చు.
iii ) ఈ డొనేషన్స్:
ఈ డొనేషన్స్ ని ఎంపిక చేసుకొన్న భక్తులు అందులోని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ను ఎంపికచేసుకొని అందులో గల 1) గోసంరక్షణ ట్రస్ట్ 2)కళ్యాణ ఆభరణ ట్రస్టు 3) నిత్య ఆన్నదాన ట్రస్ట్ కి విరాళములు చెల్లింపు చేయవచ్చును.
దేవస్థానం ఫోన్. 08578-222240 ద్వారా తెలుసుకొనవచ్చును. వెబ్సైట్ లో చూపిన దేవస్థానము బ్యాంక్ అకౌంటు కు రుసుములు పంపిన వారు 9550928202 సెల్ నెం// కు వివరాలను Whatsapp చేయగలరు లేదా eo_srikalahasthi@yahoo.co.in కు మెయిల్ ద్వారా వివరాలు పంపగలరు.
పరోక్షాసేవల మరియు ఉత్సవాలు కొరకు ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు.
ఫేసుబుక్ లింక్..
https://www.facebook.com/srikalahasteeswaraswamyvari.devasthanam
యూట్యూబ్ లింక్
https://www.youtube.com/c/SrikalahastiDevasthanam